శ్రీ వేంకటేశ్వరస్వామి వారి గోవిందమాలదీక్ష
వైకుంఠ ఏకాదశి విశిష్ఠత
ఏకాదశి అనే రోజు ఎలా ఏర్పడింది ? పద్మపురాణం ఇలా వివరిస్తుంది. విష్ణుమూర్తి ముర అనే రాక్షసిని సంహరించి, ఆమె బారి నుండి దేవతలను రక్షించాడు. పశ్చాత్తాపంతో కుమిలిపోతున్న మురను చూసి, ఆమె కోసం ఏకాదశి అనే తిధిని ఏర్పరచాడు.
విష్ణుమూర్తి మురపై విజయం సాధించింది, ఈరోజునే! ఈరోజున ఎవరైతే ఉపవాసం, జాగరణ ఉండి, విష్ణు నామ స్మరణతో కాలం గడుపుతారో వారు మరణానంతరం వైకుంఠానికి చేరుకుంటారని వరం ప్రసాదిస్తాడు విష్ణుమూర్తి!
అద ఏకాదశి గాథ!
ప్రతి ఏకాదశి ముఖ్యమైనది అందున తోలి ఏకాదశి నుండి పుష్య మాసపు శుక్ల పక్ష్య దశమి వరకు ఎంతో విష్ఠిత ఉన్నది. అప్పటి నుండి శ్రీ మహవిష్ణువు యోగనిద్రలో ఉంటారని ప్రతీతి, అందుకే ముక్కోటి ఏకాదశి నాడు, స్వామివారు నిద్రలేచే సమయనికి ముక్కోటి దేవతలు, ఋషులు, తప్పసులు, మొదలగువారు వైకుంఠ ద్వారం వద్ద నిలచి భజనలు, కీర్తనలు, ధ్యానంతో సేవించి తరించి ఉత్తరద్వారం వద్ద వెచి ఉంటారట. ఆ బ్రహ్మముహుర్తపు తరుణంలో ఎవరైతే అ రోజున ఉపవాసం, జాగరణ ఉండి, విష్ణునామ స్మరనతో కాలం గడుపుతారో వారి అందరిని శ్రీ మహవిష్ణువు తనతో వైకుంఠం తీసుకొని వెళ్ళి మోక్షం ప్రసాదిస్తారని పురణాలు చెబుతున్నాయి. పాపాత్మలు, పుణ్యాత్ములు అని కుడా చూడరట అంత పవిత్రమైన రోజు ముక్కోటి ఏకాదశి !!!